- Advertisement -
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రోజుకో కొత్త మాట మాట్లాడుతున్నారని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తునాడని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మొన్న మహిళల పుస్తె మట్టెలు తీసుకుంటారని అన్నాడని, ఇప్పుడు కొత్త మాట చెప్తున్నాడని ఆయన విమర్శించారు.
ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా అమలు చేశావా అని ఆయన ప్రశ్నించారు. అయోధ్య చెప్పుకొని ఓట్లు అడుగుతావా..? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవా ? అని ప్రశ్నలు సంధించారు. ప్రజల పరిస్థితి ఎలా ఉందొ పట్టించు కోరని, వారికి ,చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వారికి జై శ్రీరామ్ తప్ప ఇంకొకటి లేదని, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని విహెచ్ చెప్పారు.
- Advertisement -