Monday, January 20, 2025

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం..

- Advertisement -
- Advertisement -

PM Modi land at Shamshabad Airport

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ నుచి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీని గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి మహేందర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జ్వరం కారణంగా ప్రధాని మోడీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే, సాయంత్రం చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత రంగారెడ్డి ముచ్చింతల్‌లో రామానుజచార్య సహస్రాబ్ధి వేడుకల్లో ప్రధాని పాల్గొనున్నారు. మంత్రి శ్రీనివాసయాదవ్ కు ప్రధాని స్వాగత, వీడ్కోలు భాద్యతలు అప్పగించారు.

PM Modi land at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News