బాలాసోర్(ఒడిశా): ప్రధాని నరేంద్ర మోడీ భారత వాయుసేన హెలికాప్టర్‌లో శనివారం ఒడిశాలోని బాలాసోర్‌కు చేరుకున్నారు. అక్కడ రెండు ప్యాసింజర్ రైళ్లు, ఓ గూడ్స్ బండి ఢీకొట్టుకోవడంతో 250కిపైగా మంది చనిపోయారు. 900 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 17 బోగీలున్న కొరమండల్ ఎక్స్‌ప్రెస్, ఎస్‌ఎంవిటిహౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ సంభవించనంత రైలు ప్రమాదం సంభవించింది.
సౌత్ ఈస్టర్న్ రైల్వే తన బులెటిన్‌లో ‘ట్రయిన్ నంబర్ 12841 షాలిమార్ చెన్నై, కోరమండల్ ఎక్స్‌ప్రెస్, ట్రయిన్ నంబర్ 12864 సర్ ఎం. విశ్వేశ్వరయ్యహౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్… బహనగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జూన్ 2న సాయంత్రం 6.55 గంటలకు పట్టాలు తప్పాయి’ అని పేర్కొంది
Odisha train mishap: PM Modi arrives at crash site in Balasore; to meet survivors in hospital
Read @ANI Story | https://t.co/JtnKVMVvXO#NarendraModi #PrimeMinister #OdishaTrainCrash #OdishaTrainAccident #OdishaTrain #TrainAccident #TrainAccidentInOdisha pic.twitter.com/7UGZwiGekU
— ANI Digital (@ani_digital) June 3, 2023