Friday, November 22, 2024

డాక్టర్లు, సిఎలకు మోడీ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జాతీయ డాక్టర్ల, చార్టెర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ డాక్టర్లను, చార్టెర్డ్ అకౌంటెంట్ల సేవలను ప్రశంసించారు. డాక్టర్లు ధైర్యానికి, నిస్వార్ధ సేవకు, ఓర్పుకు ప్రతీకలని పేర్కొన్నారు. అనూహ్యఅసాధారణ సమయాల్లో కూడా డాక్టర్ల అంకిత భావం వైద్యానికి అతీతంగా సాగిందని, ఇది సమాజానికి ఆశ, బలం చేకూరుస్తుందని, అందుకే తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోడీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రఖ్యాత వైద్యులు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన విధాన్ చక్రవర్తి సంస్మరణార్థం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జులై 1 న జరుపుకుంటున్నారు. ఆయన జయంతి, వర్ధంతి కూడా ఒకే రోజు కావడం విశేషం.

మరో ట్వీట్‌లో ప్రధాని మోడీ చార్టెర్డ్ అకౌంటెంట్ల సర్వీస్‌లను కొనియాడారు. 1949 జులై 1న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) ని నెలకొల్పడమైంది. ఈ సందర్భంగా చార్టెర్డ్ అకౌంటెంట్ల దినోత్సవాన్ని ఏటా జులై 1న జరుపుకుంటున్నారు. చార్టెర్డ్ అకౌంటెంటెంట్స్ డే సందర్భంగా మన కీలకమైన ఆర్థిక రూపశిల్పులకు సంబంధించిన వృత్తి పరమైన సమాజాన్ని గౌరవించాల్సి ఉందని ప్రశంసించారు. వారి విశ్లేషాణాత్మక చతురత, దృఢమైన నిబద్ధత, మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర వహిస్తుందని ప్రశంసించారు. వారి నైపుణ్యం దేశ అభ్యున్నతికి, స్వయం సామర్ధానికి సహాయ పడుతుందని శ్లాఘించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News