- Advertisement -
జెఎంఎం ముడుపుల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప తీర్పుగా ఆయన అభివర్ణించారు. స్వచ్ఛమైన రాజకీయాలకు ఈ తీర్పు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ లేదా శాసనసభలో ఓటింగ్ లేదా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చేసే ప్రసంగాలకు సంబంధించి లంచం ఆరోపణలు వచ్చినపుడు వారు చట్టపరమైన చర్యలకు అతీతులంటూ 1998లో పివి నరసింహారావు ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సోమవారం సుప్రీంకోర్టుకు చెదిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు నేడు గొప్ప తీర్పు ఇచ్చిందని, స్వచ్ఛమైన రాజకీయాలకు ఇది దోహదపడడమేగాక వ్యవస్థ పట్ల ప్రజలలో నమ్మకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -