Thursday, January 23, 2025

సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ను ప్రారంభించిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

షాడోల్ (మధ్య ప్రదేశ్): ప్రధాని నరేంద్రమోడీ శనివారం నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ 2047 ను ప్రారంభించారు. ఈ మేరకు ఆ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యాధి చికిత్సకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన పోర్టల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని షాడోల్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో విపక్షాలపై ధ్వజమెత్తారు. కుటుంబ రాజకీయాలే ప్రధానంగా ఉంటున్న కాంగ్రెస్‌తో సహా విపక్ష పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా సికిల్ సెల్ రంగుల కోడ్‌తో కూడిన కౌన్సెలింగ్ కార్డులను కొంతమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే మూడు కోట్ల డిజిటల్ ఆయుష్మాన్ కార్డులను, ఒక కోటి పివిసి ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. రాణీ దుర్గావతి 500వ జయంతి వేడుకలు దేశం మొత్తం మీద నిర్వహిస్తామని, స్టాంపులు విడుదల చేస్తామని ప్రకటించారు. సికిల్ సెల్ వ్యాధి నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ముఖ్యంగా గిరిజన ప్రజలకు ఈ వ్యాధి నుంచి విముక్తి కలిగించడానికి 2023 బడ్జెట్‌లో ప్రకటించడమైందని చెప్పారు. అలాగే ఆయుష్మాన్ కార్డు వల్ల ఆస్పత్రుల్లో రూ. 5 లక్షల వరకు విలువైన వైద్యం పొందవచ్చని, ఇది మోడీ గ్యారంటీ అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News