Saturday, November 9, 2024

ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

వారణాసి(యుపి): దేశవ్యాప్తంగా ఆరోగ్యరక్షణ మౌలిక వసతులకు సంబంధించిన పథకాలను పటిష్టం చేయడానికి ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల మిషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిన నుంచి ప్రారంభించారు. అంతేగాక రూ.5,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను ప్రధాని మోడీ తన నియోజకవర్గంలో ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు అందనంగా దేశవ్యాప్తంగా ఆరోగ్యరక్షణ మౌలికవసతుల పటిష్టం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అతిపెద్ద పాన్ ఇండియా పథకాలలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలికవసతుల మిషన్ ఒకటి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ వైద్యరంగంలో క్రిటికల్ కేర్, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణను పటిష్టపరచడమే దీని లక్ష్యం. 10 ప్రాధాన్యతా రాష్ట్రాలలోని 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాలకు ఈ మిషన్ తోడ్పాడునందచేస్తుంది. అలాగే అన్ని రాష్ట్రాలలో 11,024 పట్టణ ఆరోగ్య, వెల్‌నెస్ సెంటర్లను ఈ మిషన్ ఏర్పాటు చేస్తుంది.

PM Modi launches Ayushman Bharat health infrastructure mission

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News