Thursday, November 21, 2024

సీనియర్ సిటిజెన్స్ కి ‘ఆయుష్మాన్ భారత్’ ఉచిత ఆరోగ్య బీమా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. పేద, ధనిక అనే ఎలాంటి తారతమ్యం లేకుండా దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి.నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల టీకా కోసం ఉద్దేశించిన యు-పోర్టల్(U-WIN)ను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు.

కుటుంబంలో 70 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం,సగం ప్రయోజనాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం లబ్ధి పొందేందుకు పిఎంజెఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. బీమా కార్డును ఆమోదం పొందాక ఆన్ లైన్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణకు ఆధార్ కార్డు ఒక్కటి సరిపోతుంది.

Ayushman Bharat 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News