Saturday, November 23, 2024

పట్టాలపై పరుగులు తీసిన తొలి ‘నమో భారత్’ రైలు

- Advertisement -
- Advertisement -

సాహిబాబాద్( యుపి): దేశంలో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘ నమోభారత్’ పట్టాలపై పరుగులు తీసింద సాహిబాబాద్ స్టేషన్‌లో ఢిల్లీఘజియాబాద్‌మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్‌ఆర్‌టిఎస్)కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలుకు ప్రధాని జెండా ఊపారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం తాను ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని , ఈ రోజు సాహిబాబాద్‌నుంచి దుహై డిపో వరకు 17 కిలోమీటర్ల మార్గంలో నమో భారత్ రైళ్ల సర్వీసులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మరో ఏడాది, ఏడాదిన్నరలో ఢిల్లీమీరట్ కారిడార్ పూర్తయినప్పుడు తానే దాన్ని ప్రారంభిస్తానన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, పశ్చిమ యుపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన తర్వాత ప్రధాని దానిలో ప్రయాణించారు.

స్కూలు విద్యార్థిన్థులు, ర్యాపిడ్ ఎక్స్ సిబ్బందితో ముచ్చటించారు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా రూపొందించిన ఈ రైలులో ఆధునిక సదుపాయాలు ఉంటాయి. ఢిల్లీఘజియాబాద్‌మీరట్‌మధ్య రూ.30,000 కోట్ల వ్యయంతో చేపట్టిన రీజినల్ ర్యాపిడ్‌ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లో సాహిబాబాద్ దుహై డిపో మధ్య ముందుగా 17 కిలోమీటర్ల దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటిమధ్య 5 స్టేషన్లు ఉంటాయి.ఈ రైళ్లు ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు అందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకొకటి చొప్పున నడిచే ఈ రైలులో ఆరు బోగీలుంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం బోగీల్లో 62 సీట్లు ఉంటాయి. నించుని ప్రయాణించే వారితో కలుపుకొని ఒక్కో రైలులో ఏకకాలంలో 1700 మంది ప్రయాణించవచ్చు. ప్రామాణిక కోచ్‌లలో టికెట్ ధర రూ.2050 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40 100 మధ్య ఉంటుంది. త్వరలోనే ఢిల్లీ, యుపి, హర్యానా, రాజస్థాన్‌లలోని అనేక పట్టణాలను నమో భారత్ రైళ్లతో అనుసంధానం చేయడం జరుగుతుందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. తొలి నమో భారత్ రైల్లో డ్రైవర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా మహిళలే ఉంటారని కూడా ప్రధాని తెలిపారు.

బెంగళూరు మెట్రోలో రెండు మార్గాలు కూడా..
బెంగళూరు మెట్రో ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌కు చెందిన రెండు మార్గాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ వర్చువల్‌గా పాల్గొన్నారు. అయితే ప్రారంభోత్సవం కోసం ఎదురు చూడకుండా బైపనహళ్లి కృష్ణరాజపుర, కెంగేరి చల్లఘట్ట మార్గాల్లో మెట్రో సర్వీసులు ఈ నెల 9నుంచి నడుస్తున్నాయి. ఈ రెండు మార్గాలను ప్రారంభించడంతో ‘ నమ్మ మెట్రో’ మొత్తం పొడవు 74 కిలోమీటర్లకు పెరిగింది. ప్రతి రోజూ7.5లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News