Friday, November 15, 2024

మిషన్ లైఫ్ ప్రారంభంపై భారత్‌కు ప్రపంచ దేశాల ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

డియర్ నరేంద్ర.. మీ చొరవ అమోఘం 
మిషన్ లైఫ్ ప్రారంభంపై భారత్‌కు ప్రపంచ దేశాల ప్రశంసలు
గాంధీనగర్: వాతావరణ మార్పులతో కలిగే వినాశనకరమైన పర్యావసానాల నుంచి భూ గ్రహాన్ని రక్షించేందుకు భారత్ నేతృత్వంలో అంతర్జాతీయ కార్యాచరణకు అడుగుపడింది. పర్యావరణ పరిరక్షణను ఒక సామూహిక ఉద్యమంగా మార్చే దిశగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో మిషన్ లైప్ (ఎల్‌ఐఎఫ్‌ఇ లైఫ్‌స్టైల్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్)ను ప్రారంభించారు. కేవడీయాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధానితోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ మిషన్ ఆరంభించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రతిచోటా వాతావరణ ప్రభావం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క భారత్ చూపిన చొరవను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ‘ఈ వాతావరణ మార్పు అనేది విధానపరమైన సమస్య అనే అపోహ ఉంది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు దీనిపై చర్యలు తీసుకుంటాయనే అభిప్రాయం ఉంది. కానీ ప్రజలు దాని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. కొందరు ఏసీని 17లో పెట్టుకుంటారు. ఇది వాతావరణంపై దుష్ప్రభావం చూపుతోంది. జిమ్‌కి వెళ్లేటప్పుడు సైకిళ్లను వాడండి. మనవంతుగా జీవనశైలిలో చేసుకునే మార్పులు… పర్యావరణానికి మేలు చేస్తాయి. ఈ వాతావరణ మార్పు అన్ని చోట్లా మనకు కనిపిస్తోంది. హిమానీనదాలు కరుగుతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. మిషన్ లైఫ్.. ఈ మార్పులకు కట్టడి చేసేందుకు ఉపకరిస్తుంది. రీయూజ్, రెడ్యూస్, రీ సైకిల్ అనేవి… భారత సంస్కృతిలో భాగం… వీటిని తిరిగి మన జీవితంలో భాగం చేసుకోవాలి’ అని ప్రధాని సూచించారు.

ఈ సందర్భంగా గుటెర్రస్ జీ 20 దేశాల సామర్థాన్ని ప్రస్తావించారు. జీ20 దేశాలు 80 శాతం గ్రీన్‌హౌస్ గ్యాస్‌ను విడుదల చేస్తున్నాయి. మరోపక్క ఆ దేశాలే ప్రపంచ జీడీపీలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్థిరమైన జీవనం వైపు నడిపించే శక్తి ప్రకృతిని పరిరక్షించే సామర్థం వాటికి ఉన్నాయి’ అని అన్నారు. ఇదిలా ఉంటే ఈ మిషన్ లైఫ్ ప్రారంభంపై ప్రపంచ దేశాలు భారత్‌ను కొనియాడాయి. డియర్ ప్రైమ్ మినిస్టర్.. డియర్ నరేంద్ర ఇతర సిబ్బంది, స్నేహితులకు నమస్తే…ఈ ప్రత్యేక సమయంలో నేను మీవద్ద ఉండాలనుకున్నాను. భారత్ ప్రారంభించిన ఈ మిషన్ విజయం సాధించేలా ఫ్రాన్స్ కూడా కలిసి పనిచేయాలనుకుంటోంది’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సందేశం పంపారు. మడగాస్కర్, జార్జియా, బ్రిటన్ వంటి దేశాలు ఈ ప్రభుత్వాన్ని ప్రశంసించాయి.

PM Modi launches Mission LiFE in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News