Wednesday, January 22, 2025

‘గంగా విలాస్’ను ప్రారంభించిన ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవి గంగా విలాస్’ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. భారత్‌లో కొత్త తరం పర్యాటకానికి ఇది నాంది పలుకనుంది. కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. దీని స్ఫూర్తితో దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయన్నారు మోడీ. భారత్‌లో తయారైన తొలి నౌక గంగా విలాస్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు మొదటి ప్రయాణం చేయనున్నారు. వారణాసి నుంచి దిబ్రూగఢ్ వరకు ఈ ప్రయాణం ఉంటుంది. ప్రయాణం మధ్యలో బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ నౌక పయనిస్తుంది. భారత, బంగ్లాదేశ్‌లలో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణం మార్గంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు వీక్షించొచ్చు. ఈ నౌకలో 36 మంది పర్యాటకులు ప్రయాణించొచ్చు. 51 రోజుల పాటు 3200 కిమీ. వరకు ఈ నౌక ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఒక్కొక్కరికి రోజుకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చవుతుంది. 51 రోజుల ట్రిప్‌లో ఒక్కొక్కరికి సుమారు రూ. 20 లక్షలు ఖర్చు కానుందని క్రూజ్ నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News