Saturday, November 23, 2024

రూ.2800 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ ఒడిశాలో రూ.2800కోట్లతో చేపట్టనున్న జాతీయ రైల్వే ప్రాజెక్టులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ. 1000 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. పిఎంఎవైజి పథకం కింద 14 రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది లబ్ధిదారులకు మొదటి విడత కింద నిధులు విడుదల చేశారు. ఇదే పథకం లోని 26 లక్షల లబ్ధిదారులకు గృహాలు కేటాయిస్తూ వారికి అప్పచెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఒడిశా రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమమని, కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పటికి వంద రోజులైందని పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ రత్నభాండాగారం తెరవడంతోపాటు ఇప్పటివరకు తమ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను వివరించారు. దేశంలో పేదలకు 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నామని, యువతకు రూ. 2 లక్షల కోట్ల పిఎం ప్యాకేజీ కింద ఉద్యోగాలు కల్పిస్తామని, ఈమేరకు ప్రైవేట్ సంస్థల్లో వారికి ఉద్యోగాలు కల్పించడమౌతోందని, ఈ మేరకు వారు మొదటి వేతనం తీసుకుంటున్నారని ప్రకటించారు. మెడికల్ కాలేజీల్లో అదనంగా 78,000 సీట్లు కేటాయించడమైందన్నారు. 60,000 గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టనున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News