Tuesday, December 24, 2024

జిల్లాల ప్రగతి లక్ష్యంతో 25 కోట్ల మందికి మేలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ నిర్ణీత అభివృద్ధి లక్షాల కార్యక్రమంతో ఇప్పుడు 112 జిల్లాల్లో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇప్పుడు జిల్లా స్థాయిల్లో ఎంచుకున్న ఈ యోజనను ఇకపై బ్లాక్‌ల స్థాయికి తీసుకువెళ్లడం జరుగుతుంది, అప్పుడు బ్లాక్‌లలో జరిగిన ప్రగతిని తాను వచ్చే ఏడాది స్వయంగా పరిశీలిస్తానని ప్రధాని చెప్పారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అమలు సంబంధిత

కార్యక్రమం సంకల్ప్ సప్తాహ్ ప్రారంభోత్సవ సభలో శనివారం ప్రధాని మాట్లాడారు. దేశంలోని 112 జిల్లాలకు చెందిన పాతిక కోట్లకు పైగా ప్రజల స్థితిగతులను ఆకాంక్ష జిల్లాల ప్రోగ్రాం మార్చివేసిందని, ఇక మరింత ప్రగతి సాధించేలా ఇప్పుడు బ్లాక్ స్థాయి ప్రగతి లక్షాల కార్యక్రమం ఎంచుకున్నామని ప్రధాని వివరించారు. వచ్చే ఏడాది ఆకాంక్ష సంకల్ప కార్యక్రమంలో భాగంగా 500 బ్లాక్‌ల్లో కనీసం 100 బ్లాక్‌ల వరకూ స్ఫూర్తిదాయక ప్రాంతాలు అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News