Wednesday, January 22, 2025

తెలంగాణలో 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్ పేట, మలక్ పేట, మల్కాజిగిరి ఉప్పుగూడతోపాటు ఆదిలాబాద్, భద్రాచలం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, రామగుండం, తాండూరు, రాయగిరి, జహీరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ కింద తొలి విడుతలో రాష్ట్రంలో రూ.898 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News