మీరట్: గత ప్రభుత్వ హయాంలో నేరగాళ్ల ఆటలు సాగాయి, ఇప్పుడు వారిని జైళ్లకు పంపించే ఆట యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆడుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ నేతృత్వంలోని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం నేరగాళ్లు, మాఫియాకు అండగా నిలిచిందని ప్రధాని అన్నారు. సాయంత్రంవేళ మీరట్‌లో ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరగలేకపోయారన్నారు. నేరగాళ్లు, మాఫియా నేతలను యోగి ప్రభుత్వం జైళ్లకు పంపడంతో ఇప్పుడు వారు(మహిళలు) స్వేచ్ఛగా బయటకు వస్తూ దేశం కోసం బహుమతులు తెస్తున్నారని ప్రధాని అన్నారు. యువతుల పట్ల యువకుల విపరీత చేష్టలపై ఎస్‌పి వ్యవస్థాపకుడు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రధాని విమర్శించారు. యువకుల చిలిపి చేష్టల్ని సీరియస్‌గా తీసుకోవద్దంటూ ములాయంసింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలా సమర్థించడం సరైంది కాదని ప్రధాని హితవు పలికారు.
PM Modi lay foundation stone to Dhyan Chand University