Monday, December 23, 2024

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

వారణాసి: తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ ప్రసంగించడానికి ముందు మోఆయనకు బిసిసిఐ అధ్యక్షుడు రోజెర్ బిన్నీ, బిసిసిఐ కార్యదర్శి జై షా బ్యాట్‌ను బహూకరించారు. హర్ హర్ మహాదేవ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ ఈ స్టేడియంను మహాదేవ్(పరమశివుడు)కు అంకితం చేస్తామని ప్రకటించారు.

కాశీలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో క్రికెటర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మోడీ చెప్పారు. పూర్వాంచల్ ప్రాంతానికి ఈ స్టేడియం ఒక ధ్రువతారగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఆటలాడుకుంటామంటే పిల్లలను తల్లిదండ్రులు మందలిచేవారని, కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ఒక ప్రాంతంలో క్రీడలకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు కల్పించడం వల్ల ఆ ప్రాంతంలో యువ క్రీడాకారులకు ప్రోత్సహం లభించడమేకాకుండా స్థానికంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రధాని పేర్కొన్నారు.

మొట్టమొదటిసారి ఉత్తర్ ప్రదేశ్‌లో బిసిసిఐ ఆధ్వర్యంలో వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్హానం కానున్నదని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం సంతోషదాయకమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News