Monday, December 23, 2024

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదిక నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంతోపాటు బిబి నగర్ ఎయిమ్స్ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

అంతకుముందు నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుకులు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పలువురు బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News