Thursday, January 23, 2025

విశ్వ శ్రేయస్సు కోసం యోగా

- Advertisement -
- Advertisement -

ప్రపంచం మేలు కోసం శక్తిమంతమైన సాధనంగా యోగాను ప్రపంచం భావిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు, ప్రజలు గతం భారం లేకుండా వర్తమానంలో జీవించేందుకు యోగా దోహదం చేస్తుందన్నది ప్రపంచం భావన మోడీ తెలిపారు. శ్రీనగర్‌లోని ఎస్‌కెఐసిసిలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో యోగాభ్యాసకులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, తమ శ్రేయస్సు తమ చుట్టూ ఉన్న ప్రపంచం సంక్షేమంతో ముడిపడి ఉందని ప్రజలు గ్రహించేందుకు యోగా దోహదం చేసిందని చెప్పారు, ‘ప్రపంచం మేలుకు శక్తిమంతమైన ఉపకరణంగా యోగాను ప్రపంచం చూస్తున్నది. గతం భారం లేకుంగా వర్తమానంలో మనం జీవించేందుకు యోగా తోడ్పడుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘మనం అంతర్గతంగా ప్రశాంతంగా ఉంటే ప్రపంచంపై సకారాత్మక ప్రభావం చూపగలం& సమాజంలో సకారాత్మక పరివర్తనకు కొత్త మార్గాలను యోగా సూచిస్తోంది’ అని ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దాల్ సరస్సు తీరంలో ఎస్‌కెఐసిసి మైదానంలో నిర్వహించవలసి ఉంది.

కానీ, ఎడతెరిపి లేని వర్షం కారణంగా భవనం లోపలికి మార్చారు. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలు వేసేవారి సంఖ్య ప్రతి రోజు పెరుగుతోందని, యోగాసనాలు జనం దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారుతోందని మోడీ తెలిపారు. ‘యోగా అభ్యాసకుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నేను ఎక్కడికి వెళ్లినా యోగా ప్రయోజనాల గురించి నాతో మాట్లాగని (అంతర్జాతీయ) నేత ఎవరూ లేరు. అనేక దేశాల్లో యోగా జనం రోజువారీ జీవితాల్లో భాగంగా మారిపోతోంది’ అని మోడీ తెలియజేశారు. ఆయన ఈ సందర్భంగా తుర్క్‌మెనిస్తాన్, సౌదీ అరేబియా, మంగోలియా, జర్మనీలను ఉదహరించారు. ఈ ప్రాచీన ధ్యాన ప్రక్రియ అక్కడ శీఘ్రంగా జనాదరణ పొందుతోందని ప్రధాని చెప్పారు. ఫ్రాన్స్‌లో యోగాకు ప్రాచుర్యం కల్పించడంలో చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు పొందిన 101 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ చార్లొటి చాపిన్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు, యోగా ప్రపంచవ్యాప్తం కావడం వల్ల దాని గురించి ప్రజల భావనలో మార్పు వచ్చిందని, దాని గురించి సాధికార అవగాహనన కోసం భారత్‌కు మరింత మంది వస్తున్నారని మోడీ చెప్పారు.

‘జనం ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం వ్యక్తిగత యోగా శిక్షకులను నియమించుకుంటున్నారు. కంపెనీలు తమ ఉద్యోగుల కోసం మనస్సు, శరీరం (ఫిట్‌నెస్) కార్యక్రమాల్లో యోగాను చేరుస్తున్నాయి, అది జీవనోపాధికి కొత్త అవకాశాలు కల్పిస్తున్నది’ అని ఆయన చెప్పారు. ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను యోగా సూచిస్తోందని ప్రధాని తెలిపారు. ‘యోగా కేవలం పరిజ్ఞానం కాదు. అది శాస్త్రం కూడా. ఈ సమాచార విప్లవ శకంలో అనేక సమాచార వనరులు ఉంటున్నాయి. ఏదో ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించడం మానవ మస్తిష్కానికి ఒక సవాల్. దీనికి పరిష్కారం యోగాలో కూడా ఉంది. అది మనస్సు కేంద్రీకరించేందుకు దోహదం చేస్తుంది. అందుకే సైన్యం నుంచి క్రీడాకారుల వరకు వారి దైనందిన కార్యకలాపాల్లో యోగాను చేర్చడమైంది’ అని ఆయన చెప్పారు. రోదసీ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వ్యోమగాములు, వ్యక్తులు కూడా యోగాలో శిక్షణ పొందుతున్నారని, అది ‘ఉత్పాదకతతో పాటు ఓర్పును’ పెంచుతుందని ప్రధాని తెలిపారు.

‘అనేక జైళ్లలో ఖైదీల్లో సకారాత్మక భావనలు రావడానికి వీలుగా వారికి యోగా కూడా నేర్పుతున్నారు’ అని ఆయన చెప్పారు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా యోగాభ్యాసాన్ని చేపడుతున్నారని, అది కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యాటక రంగానికి మేలు చేస్తుందని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News