Sunday, February 23, 2025

గద్దర్ భార్య విమలకు ప్రధాని లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని.. తెలంగాణ సంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేశాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఈ మేరకు గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ రాశారు. ఈ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై చాలా బాధ పడినట్లు ప్రధాని మోడీ తెలిపారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ కొనియాడారు. గద్దర్ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేం. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News