Sunday, December 22, 2024

లోక్‌సభ ఎన్నికలకు మోడీ రెడీ

- Advertisement -
- Advertisement -

13వ తేదీన బీహార్ సభలతో ఆరంభం

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సంరంభం ఆరంభం అవుతోంది ఈ నెల 13వ తేదీ న ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం అయింది. బీహార్‌లో జరిగే బహిరంగ సభతో బిజెపి, మిత్రపక్షాల ఎన్‌డిఎ తరఫున మోడీ సభ జరుగుతుంది. ఈ నెలలోనే అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట ఘట్టం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత అంశం ద్వారా అత్యధిక సంఖ్యలో జనం మద్దతు కూడగట్టుకోవాలని, ఓట్లశాతం పెంచుకుని, సీట్ల కనీసం 400 వరకూ పొందాల్సి ఉందని మోడీ, అమిత్ షాలు పార్టీ శ్రేణులకు పిలుపు నిస్తూ వస్తున్నారు.

ప్రతిపక్షం సంఘటితం కాదని, సీట్ల సర్దుబాట్ల వ్యవహారం ఇండియా కూటమికి చిక్కులుతెచ్చిపెడుతుందని బిజెపి ఆశిస్తోంది. అయితే విపక్షాల బలహీనత విషయం గురించి ఆలోచించకుండా , తమకు ఉన్న బలం గురించి ప్రజలలో ప్రచారం ఉధృతి సాగించాలని మోడీ భావిస్తున్నారు. విపక్షాల తరఫున కూటమి ఏర్పాటుకు జెడియూ నేత , సిఎం నితీశ్ కుమార్ సారధ్యం వహించడంతో దీనికి ప్రతిగా బీహార్ నుంచే బిజెపి ప్రచార యాత్రలకు మోడీ, అమిత్ షాలు వ్యూహరచనకు దిగారని వెల్లడైంది.

ఇందులో భాగంగానే ఈ నెల 13 తేదీన మోడీ బహిరంగ సభలకు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. బేగూసరాయ్, ఔరంగాబాద్ , బేతియాలలో మోడీ సభలు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలో 40 ఎంపి సీట్లను బిజెపి టార్గెట్ చేసుకుంది. బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, అమిత్ షా కూడా వరుసగా ఆ తరువాత బీహార్‌లో విస్తృతంగా పర్యటిస్తారని, పలు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు ఏర్పాటు అవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News