Thursday, January 30, 2025

ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని మోదీ.. వెల్లడించిన ట్రంప్

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన వైట్‌హౌస్‌ను సందర్శించనున్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు రాబోతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో మోడీ వైట్‌హౌస్‌లో సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. ఇద్దరి నేతలు ఫోన్ కాల్ లో సంభాషించారు. ఈ క్రమంలోనే పీఎం మోడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యటన గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తిరిగి వస్తుండగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. “సోమవారం నేను భారత ప్రధాని మోడీతో చాలాసేపు మాట్లాడాను. అతను వచ్చే నెలలో, బహుశా ఫిబ్రవరిలో వైట్ హౌస్‌కి రాబోతున్నారు. భారత్‌తో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ అన్నారు. కాగా, రెండోసారి ట్రంప్‌ బాధ్యతల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఇక, తొలిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News