Wednesday, February 26, 2025

మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోడీ !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రష్యాలో పర్యటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అక్కడ జరగనున్న గ్రేట్ పేట్రియాటిక్ వార్ 80 వ వార్షికోత్సవ పరేడ్‌లో ఆయన పాల్గొనే అవకాశ ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అక్కడి వార్తా సంస్థ టాస్ వెల్లడించింది. టాస్ ప్రకారం మే 9న మాస్కో లోని రెడ్ స్కేర్ వద్ద గ్రేట్ పేట్రియాటిక్ వార్ 80 వ వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి మోడీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత సైనిక దళం సైతం కవాతు నిర్వహించనున్నట్టు సమాచారం.  అయితే దీనిపై విదేశాంగ శాఖ ఏ ప్రకటన చేయలేదు. ఇక ఈ పరేడ్‌కు వివిధ దేశాల అధినేతలను ఆహ్వానిస్తున్నట్టు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, గతేడాది అక్టోబరులో మోడీ రష్యాలో పర్యటించారు.

కజన్ వేదికగా జరిగిన 16 వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఆ దేశాధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా పలువురు దేశాధినేతలతో మోడీ చర్చలు జరిపారు. బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన మోడీ, దౌత్యం, చర్చలకు భారత్ మద్దతు ఇస్తుందని , యుద్ధానికి కాదని పునరుద్ఘాటించారు. రష్యాఉక్రెయిన్ యుద్ధం , పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు, ఆర్థిక అస్థిరత,వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై మూడేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికాతో సహా పలు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో మోడీ మాస్కోలో పర్యటనకు వెళ్లడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News