Monday, December 23, 2024

మనదేశ విపత్తు నిర్వహణ సత్తా గొప్పతనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత దేశం గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేసుకున్న విపత్తు నిర్వహణ సత్తా నేడు గొప్ప దృష్టాంతంగా మారిందని, బిపర్‌జోయ్ తుపాన్ వల్ల కచ్‌లో విధ్వంసం జరిగినా, ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలు , సర్వసన్నద్ధతతో ఎదుర్కొన్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. లక్ష్యం ఎంతపెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనా, భారతీయుల సమష్టి శక్తి , ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోడీ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ మన్‌కీబాత్ కార్యక్రమం ప్రతినెలా ఆదివారం ప్రసారమవుతూ ఉండేది. అయితే ఈనెల 21 నుంచి ప్రధాని మోడీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించబోతున్నందువల్ల ఈ 102 వ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని ముందుగానే ప్రసారం చేశారు. ఇందులో ముఖ్యాంశాలు…. వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని, ఒకే ప్రపంచంఒకే కుటుంబంగా అందరి సంక్షేమం కోసం యోగా అని, ఇది యోగా స్ఫూర్తిని వ్యక్తం చేస్తుందన్నారు. ఇది అందరినీ అనుసంధానం చేసి, అందరూ తనను అనుసరించే లా చేస్తుందన్నారు.

2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని భారత దేశం లక్షంగా పెట్టుకుందని, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది క్షయ రోగులను దత్తత తీసుకుంటున్నారని, ఇది భారత దేశ వాస్తవ బలమని వివరించారు. ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో అంతరించిపోయిన నదిని ప్రజలు పునరుద్ధరించారని, ఈ నది మూలాధారాన్ని అమృత్ సరోవర్‌గా తీర్చి దిద్దారని చెప్పారు. మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలనను పరిశీలించాలని , ఆయన నుంచి ధైర్యసాహసాలతోపాటు ఆయన పరిపాలన నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని, ఆయన మేనేజ్‌మెంట్ స్కిల్ , మరీ ముఖ్యంగా నీటి యాజమాన్యం, నావికాదళం నైపుణ్యాలు, ఇప్పటికీ భారత దేశానికి గర్వకారణమని వివరించారు.

నిస్సారమైన చౌడు భూములను సారవంతంగా , పచ్చదనంతో నిండిపోయేలా చేయాలంటే జపాన్ లోని మియావాకీ అనే విధానం చాలా బాగుంటుందని, ఈ టెక్నిక్‌ను క్రమంగా భారత దేశంలో కూడా అనుసరిస్తున్నారని తెలిపారు. కేరళలో టీచర్ రాఫి రామ్‌నాథ్ ఈ విధానాన్ని ఉపయోగించి 115 రకాల మొక్కలతో విద్యావనం పేరుతో ఓ చిన్న అడవిని సృష్టించారన్నారు. ఈ చిట్కాను ఉపయోగించాలని దేశ వాసులందరినీ కోరుతున్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News