Tuesday, November 5, 2024

వెంకయ్యనాయుడుతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో భేటీ ఆయ్యారు. ఢిల్లీ లోని త్యాగరాజ్ మార్గ్ లోని వెంకయ్యనాయుడు నివాసంలో మోడీ కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ జాతీయ ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీపై మోడీ ట్వీట్ చేశారు. తాను వెంకయ్యనాయుడును కలిశానని, ఆయనతో దశాబ్దాలుగా పనిచేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. భారతదేశ పురోగతి పట్ల ఆయన వివేకం, ఆసక్తి సర్వదా ప్రశంసనీయమని మోడీ అభివర్ణించారు.

అలాగే ఈ భేటీపై వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. మోడీ తన నివాసానికి వచ్చి కలిశారని, భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోడీకి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై మా అభిప్రాయాలను ఈ సందర్భంగా పరస్పరం పంచుకున్నామని వివరించారు. నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాలలో భారత్ మరింత ప్రకాశవంతమౌతుందని, సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News