Monday, December 23, 2024

యుద్ధ భూమిలో ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కీవ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉక్రెయిన్ చేరుకున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య చల్లారని ఘర్షణలు , పరస్పర భయానక దాడుల ప్రాంతంలో ప్రధాని మోడీ పర్యటన చారిత్రాత్మకం అయింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణను నివారించే ప్రతిపాదనలతో వెళ్లుతున్నానని, యుద్ధం ఎప్పుడూ పరిష్కారానికి మార్గం కాదని చెప్పిన మోడీ శుక్రవారం తొలిసానిగా రాజధాని కీవ్‌కు చేరారు. భారతీయ ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.. 1991లో స్వాతంత్య్రం పొందిన తరువాత ఈ దేశానికి ఏ భారత ప్రధాని రాలేదు. ఓ వైపు ఉక్రెయిన్ సేనలు రణవ్యూహాలకు పదును పెడుతూ రష్యా పశ్చిమ కర్‌స్కు ప్రాంతంపై వ్యూహాత్మక దాడిని సాగిస్తూ ఉన్న దశలోనే ప్రధాని మోడీ ఉక్రెయిన్‌కు చేరారు. భారతదేశం రష్యా వైపు మొగ్గుచూపుతున్నదనే విమర్శల నేపథ్యంలో మోడీ ఇక్కడికి రావడం అంతర్జాతీయ కీలక పరిణామం అయింది. ఘ ర్షణ దశలో పర్యటన ఓ విధంగా ఆయన యుద్ధ భూమిలోకి అడుగుపెట్టినట్లే అయిందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌లో పది గంటల పర్యటనకు మోడీ పో లండ్ పర్యటన తరువాత వార్సా నుంచి కీవ్‌కు చేరారు. సదిగం టల పాటు ఆయన రైలులో ప్రయాణించి కీవ్‌కు చేరా రు. ఆయనను వచ్చిన మోడీ తొలుత కీవ్‌లోని అమరుల స్మారక స్థలికి చేరారు. అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షులు జె లెన్‌స్కీ మోడీకి స్వాగతం పలికారు. మోడీ ఆయనను ఆ త్మీ య ఆలింగనం చేసుకున్నారు. దాడులలో మృతి చెందిన చి న్నారులకు మోడీ నివాళులు అర్పించారు.ఇటువంటి యు ద్ధాలు భావితరాలకు ప్రత్యేకించి అన్నెంపున్నెం తెలియని ప సిపాపలకు చితిపేర్చాయని, ఎందరి పిల్లలనో అనాధలు చేశాయని మోడీ వ్యాఖ్యానించారు. ఇక్కడి సంక్షోభాన్ని తెలిపే ఛాయాచిత్రాలతో కూడిన నేషనల్ మ్యూజియంను జెలెన్‌స్కీ వెంట ఉండి ప్రధాని మోడీకి చూపించారు.

ఇక్కడి మల్టీమీడియా మార్టిరాలిజిస్ట్ ఎగ్జిబిషన్ వెలుపల అమరులైన చిన్నారుల ఆటబొమ్మలు, వారు వాడిన వస్తువులను పేర్చి ఉంచారు. ఇది చిన్నారుల జ్ఞాపకం అని జెలెన్‌స్కీ ఆవేదనతో చెప్పారు. ఇక్కడ మోడీ ఓ నిమిషం మౌనంగా నిలబ డి నివాళులు అర్పించారు. కీవ్‌లోనే ఒయాసిస్ ఆఫ్ పీస్ పా ర్క్‌లో నెలకొని ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మోడీ నివాళులు అర్పించారు. బాపూజీ చూపిన బాటలోనే ప్రపంచ యుద్ధాలకు పరిష్కారం దక్కుతుందని, ఇది అత్యవసరం అని స్పందించారు. కాలాతీతంగా మహాత్మా గాంధీ అహింసా వాదం, ఆయన బోధనలు వర్తిస్తాయని, యుద్ధ భయాల ప్రపంచానికి పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రధాని మోడీ రైలులో కీవ్ చేరుకోగానే రైల్వేస్టేషన్‌లో ఆయనకు భారతీయ సంతతి వారు స్వాగతం పలికారు.

ఉక్రెయిన్‌లోని ఇస్కాన్ బృందం ప్రధానికి స్వాగతం పలికారు. స్టేషన్ వద్ద ప్రధాని మోడీకి వందలాది మంది భారతీయులు త్రి వర్ణ పతాకాలతో అభివాదాలు తెలిపారు. భారత ప్రధాని ఇక్కడ ముందుగా ఆ తరువాత దఫాల వారిగా జెలెన్‌స్కీతో మాట్లాడుతారు.ఇది ఇద్దరి మధ్య ముఖాముఖిగా ఉం టుంది. తరువాత ఇరుదేశాల బృందాల స్థాయి సమావేశం జ రుగుతుందని ముందుగా వెలువరించిన ఏడుగంటల కా ర్యక్రమాల అజెండాలో తెలిపారు. ఈ పర్యటన ఇందుకే అని కూడా మోడీ ప్రకటించారు. ప్రధాని కొద్ది సేపు బస చేసిన హ్యాత్ హోటల్ వెలుపల కూడా భారతీయ సంతతి వారు ఆయనకు అభివాదాలు తెలిపారు.

నాలుగు ఒప్పందాలపై సంతకాలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన దశలో హుటాహుటిన ఇరు దేశాల నడుమ నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. మోడీ జెలెన్‌స్కీ చర్చల తరువాత వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతిక, మావనవీయ సాయం వంటి విషయాపై ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఇటలీలో జి 7 సదస్సు నేపథ్యంలో జెలెన్‌స్కీ మోడీ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. ఆ తరువాత మోడీ ఉక్రెయిన్‌కు రావడం, జెలెన్‌స్కీతో చర్చించడం ఇప్పుడు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News