Friday, November 22, 2024

సిఎంలతో ప్రధాని కీలక సమావేశం

- Advertisement -
- Advertisement -

PM Modi meeting with all State Chief Ministers

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎంలతో సమావేశమైన ప్రధాని కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పై బుధవారం సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఆపాలన్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ కు చేరకుండా సత్వర నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచాలని దిశానిర్దేశం చేశారు. కరోనా పొరాటంలో భారత్ ఆత్మవిశ్వాసాన్ని సాధించిందన్న ప్రధాని అది నిర్లక్ష్యానికి కారణం కాకూడదన్నారు. దేశంలోని ప్రజలు ఆందోళన, భయానికి గురవకుండా ముందు జాగ్రత్త చర్యలతో వారి ఇబ్బందులను తొలగించాలన్నారు. అవసరమైన చోటు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. వ్యాక్సిన్లు కొన్ని రాష్ట్రాల్లో 10 శాతం వృధా అయ్యాయని ప్రధాని తెలిపారు. కరోనాకు అడ్డుకట్ట వేయకుంటే మహమ్మారి మళ్లీ దేశమంతా విస్తరించే అవకాశముందని ప్రధాని హెచ్చరించారు.

PM Modi meeting with all State Chief Ministers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News