న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఇక్కడి బిజెపి ప్రధాన కార్యాలయంలో బిజెపిపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. పార్టీ ప్రభుత్వాలు ఏ విధంగా సుపరిపాలన అందిస్తున్నాయి? వైఫల్యాలు ఏమిటి? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అనే విషయాలను సిఎంలతో ప్రధాని సమీక్షించారు. బిజెపి నిర్ధేశిత సుపరిపాలనా అజెండాపై దృష్టి సారించి ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం అయినట్లు వెల్లడైంది. వివిధ సంక్షేమ పథకా అమలు తీరు , ఇంకా ఏ విధమైన సుపరిపాలనా పద్ధతులు అనుసరించాలి?
మార్పులు చేర్పుల ప్రతిపాదనలపై ప్రధాని ఈ సందర్భంగా ముఖ్యమంత్రులతో ముచ్చటించారు. బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, హర్యానా సిఎం మనోహర్ లాల్ కట్టర్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి ఈ అజెండాలో భాగంగా ప్రధానితో భేటీ అయిన వారిలో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ , యుపి నుంచి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా హాజరయ్యారు.