Thursday, January 23, 2025

సామ్ ఆల్ట్‌మన్‌తో మోడీ కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఎఐ) పరిణామం భారతదేశంలో సాంకేతిక సక్రమ ఆవర్తన క్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధాని మోడీ శుక్రవారం ఓపెన్ ఎఐ సిఇఒ సామ్ ఆల్ట్‌మన్‌తో సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలు సాంకేతిక రంగాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ దశలో ఓపెన్ ఎఐ సంస్థ అత్యంత కీలకమైన చాట్ జిపిటి ప్రక్రియను రూపొందించారు. తమ సంస్థ తరఫున ఇప్పుడు ఆరుదేశాలలో పర్యటిస్తున్న ఆల్ట్‌మన్ ఇందులో భాగంగా భారతదేశానికి వచ్చారు. ప్రధాని మోడీతో భేటీ కావడం విశేష పరిణామం అయింది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంలో ఎటువంటి మార్పులు జరుగుతాయనే విషయంపై ప్రధాని మోడీ ఆసక్తి కనబర్చారు. ఎఐ వల్ల భారతీయ సాంకేతిక పరిజ్ఞానం మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో డిజిటల్ మార్పుల ప్రక్రియ వేగవంతానికి , తద్వారా పౌరుల సాధికారికతకు సరైన మార్గం ఏర్పడే ఎటువంటి విషయం గురించి అయినా భారతదేశం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపిన ప్రధాని మోడీ ఆల్ట్‌మన్‌తో చర్చలు ఆలోచనాత్మకంగా ఉన్నాయని ట్వీటు వెలువరించారు. అంతకు ముందు సిఇఒ తమ స్పందనలో ప్రధాని మోడీ తమ సంప్రదింపులు ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు.

భారత్‌కు అపార ఐటి పరిజ్ఞానం ఉంది. ప్రత్యేకించి ఇక్కడి యువత సాంకేతిక ప్రతిభ విశేషరీతిలో ఉంది. ఈ క్రమలో ప్రస్తుత నూతన ఆవిష్కరణలు భారతీయ సాంకేతికతను ఇనుమడింపచేయడమే కాకుండా, దీనితో తమ ఆవిష్కరణలకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్న ఆల్ట్‌మన్ భారతీయ సాంకేతికతను తమ సంస్థ విరివిగా వాడుకుంటుందని సూచనప్రాయంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News