Sunday, December 22, 2024

లాక్‌హీడ్ సిఇఒతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ రంగ ఉత్పత్తు ప్రధాన సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ సిఇఒ జిమ్ టైక్లెట్‌తో సమావేశం అయ్యారు. ఆ సంస్థ ‘మేక్ ఇన్ ఇండియా, ప్రపంచం కోసం తయారీ’ నిబద్ధతను మోడీ శ్లాఘించారు. వారిద్దరి సమావేశం గురువారం జరిగింది. ‘లాక్‌హీడ్ మార్టిన్ సిఇఒ జిమ్‌టైక్లెట్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. భారత, యుఎస్ గగనతల, ర క్షణ పారిశ్రామిక సహకారంలో లాక్‌హీడ్ మార్టిన్ కీలక భాగస్వామి. ‘భారత్‌లో తయారీ, ప్రపంచం కోసం తయారీ’ లక్ష సాధన దిశగా సంస్థ నిబద్ధతను మేము స్వాగతిస్తున్నాం’

అని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేసింది. లాక్‌హీడ్ మార్టిన్ ‘ఎక్స్’లో ఆ సమావేశం చిత్రాలను పంచుకుంటూ, ‘సిఇఒ జిమ్ టైక్లెట్ గౌరవనీయ నరేంద్ర మోడీని కలుసుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా విశ్వసనీయ భాగస్వామిగా మేము స్థానిక పరిశ్రమ ప్రతిభను, సామర్థ్యాలను గుర్తిస్తున్నాం, మా రెండు దేశాల మధ్య రక్షణ, పారిశ్రామిక సంబంధాల పటిష్ఠతకు కట్టుబడి ఉన్నాం’ అని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News