Monday, September 23, 2024

క్వాడ్  భద్రతా కూటమి ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : చైనాకు చెక్ పెట్టే రీతిలో అమెరికాలోని విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్ సదస్సులో అ త్యంత వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. అ మెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కూ డిన ఈ చతుర్భుజ కీలక క్వాడ్ భేటీకి ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రస్తుత భద్రతా రక్షణ స వాళ్ల నేపథ్యంలో అనధికారిక డిఫ్యాక్టో భద్రతా కూటమిగా రూపొందాలని నిర్ణయించారు. ఈ డిఫాక్టో సెక్యూరిటీ అలయెన్స్ ఏర్పాటు నిర్ణ యం తీర్మానంలో ఎక్కడ కూడా నేరుగా చైనా, రష్యా నుంచి సవాళ్లు ఎదురవుతున్న విషయా లు ప్రస్తావించలేదు. క్వాడ్ భద్రతా కూటమి అత్యంత కీలకం అవుతుంది, వాస్తవిక, సహేతుక ఫలితాలను ఇచ్చే శక్తిగా ఉంటుంది. మంచికి భరోసా కల్పిస్తుందని ప్రతిన వహిస్తున్నట్లు క్వాడ్ సదస్సు తరువాత వెలువరించిన ప్రకటనలో తెలిపారు.

ఇండో పసిఫిక్ ప్రాంతం సుస్థిరతకు బలోపేతానికి ఈ కూటమి అవసరం ఏర్పడిందని వివరించారు. విల్లింగ్టన్ డిక్లరేషన్‌గా ప్రకటించారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వ్యూహాత్మక రీతిలో జట్టుగా మారినట్లు, ఇండో పసిఫిక్ ప్రాంతానికి రాబోయే కాలం అంతా మంచికి కూటమి ఏర్పాటు దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు క్వాడ్ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ప్రెసిడెంట్ జో బైడెన్, నరేంద్రమోడీ , జపాన్ నేత కిషిడా ఫూమియో , ఆస్ట్రేలియా నేత ఆంథోని అల్బనిస్ మధ్య సమగ్ర చర్చల తరువాత 5700 పదాలతో డిక్లరేషన్ వెలువడింది. ఇది ఈ నాలుగు దేశాల మధ్య పూర్తి స్థాయి రక్షణ ఒప్పందంగానే ఉన్నప్పటికీ , అధికారిక ముద్ర లేకుండా లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందంగా డిక్లరేషన్ ద్వారా స్పష్టం అయింది.

ఇండోపసిఫిక్ దేశాలకు 40 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లు క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ వెల్లడి

అమెరికా క్వాడ్ సమ్మిట్ థీమ్ ఈ సంవత్సరం క్యాన్సర్ మూన్‌షాట్‌పై ఆధారపడింది. అందుకే క్యాన్సర్‌పై పోరాటానికి ప్రపంచనేతలంతా మద్దతు పలికారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో పోరాటానికి సాయంగా ఇండోపసిఫిక్ దేశాలకు 40 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లు అందిస్తామని ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం అమెరికాకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ నిర్వహించిన క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక ఆరోగ్యం అనేది భారత్‌లక్షమని, అందుకే మూన్‌షాట్ చొరవ కింద 7.5 మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్‌లు, డిటెక్షన్ కిట్‌లతో పాటు వ్యాక్సిన్ల మద్దతును ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్‌కు భారత్ సొంతంగా వ్యాక్సిన్‌ను తయారు చేసిందని, ఎఐ సహాయంతో దీని కోసం కొత్త చికిత్స ప్రోటోకాల్‌లను ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచం లోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకాన్ని భారత్ అమలు చేస్తోందని, అందుబాటు ధరలో అందరికీ మందులు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అధ్యక్షుడు బైడెన్‌కు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.

కొవిడ్ మహమ్మారి సమయంలో ఇండోపసిఫిక్‌కు క్వాడ్ వ్యాక్సిన్ చొరవ తీసుకున్నామని, అందుకు తాను సంతోషిస్తున్నానని వెల్లడించారు. క్వాడ్‌లో గర్భాశయ క్యాన్సర్ వంటి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవాలని తాము నిర్ణయించామని, దానికి అన్ని దేశాల మద్దతు ఎంతో అవసరమన్నారు. “ ఇండో పసిఫిక్‌లో ప్రతి సంవత్సరం గర్భాశయ క్యాన్సర్‌తో 1,50,000 మంది మహిళలు మరణిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నేతలు, అనేక సంస్థలు, హెచ్‌పీబీ స్క్రీనింగ్, థెరఫ్యూటిక్స్‌కు 150 మిలియన్ డాలర్లకు పైగా వెచ్చిస్తున్నారు. వచ్చే ఏడాది యూఎస్ నేవీకి చెందిన వైద్యులు, నర్సులు ఇండోపసిఫిక్ సహచరులకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ నిర్వహించడంలో శిక్షణ ఇస్తారు ” అని బైడెన్ వెల్లడించారు. ఈ క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ నేతలంతా క్యాన్సర్ నివారణకు తమ సహకారం ఉంటుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా మొట్టమొదట మూన్‌షాట్ క్యాన్సర్ కార్యక్రమాన్ని 2016 లో నిర్వహించారు. క్యాన్సర్‌పై పరిశోధన వేగవంతం చేసేందుకు రోగులు, వైద్యులు, పరిశోధన సంఘాల్ని ఒక చోట చేర్చారు. 2022లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రయత్నాలు పునరుద్ధరించారు. ఫెడరల్ ఏజెన్సీలను ఒకచోట చేర్చి వైట్‌హౌస్ ద్వారా క్యాన్సర్ క్యాబినెట్‌ను కూడా సమావేశ పరిచారు. ఇప్పటివరకు ఐదు వేర్వేరు దేశాల్లో 95 కార్యక్రమాలు , విధానాలు, వనరులు అందించారు. ఢిల్లీలో మొట్టమొదటి యుఎస్‌ఇండియా క్యాన్సర్ మూన్‌షాట్ డైలాగ్‌ను నిర్వహించింది.

ఐరాసలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ అంశానికి క్వాడ్ నాయకులు కూడా మద్దతు పలికారు. మనదేశం ఎప్పటి నుంచో శాశ్వత సభ్యత్వానికి పట్టుపడుతోంది. భద్రతా మండలిలోని ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నా ఒక్క చైనా మాత్రం మోకాలడ్డుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News