- Advertisement -
ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి దిగ్గజాలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసాలలో కలుసుకున్నారు. వరుసగా మూడవ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కోరడానికి ముందు వారిద్దరితో మోడీ భేటీ అయ్యారు. ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నేతగా, బిజెపి పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్‌సభలో బిజెపి నేతగా ఎంపికైన వెంటనే అద్వానీని మోడీ కలుసుకున్నారు. అద్వానీతో సమావేశం అనంతరం మోడీ బిజెపి మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. ప్రధాని మోడీ ఆ తరువాత మాజీ రాష్ట్రపలి రామ్‌నాథ్ కోవింద్‌తో కూడా భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి 240 సీట్లు లభించగా, ఎన్‌డిఎ 543 మంది సభ్యుల లోక్‌సభలో 293 సీట్లతో మెజారిటీ సాధించింది.
- Advertisement -