Wednesday, January 22, 2025

ద్రౌపది ముర్మూకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi meets Presidential candidate Draupadi Murmu

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్మూ తన నామినేషన్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రేపు జూన్ 24న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపదిముర్మూకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆమె రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారు ప్రశంసించారని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు. కాగా, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్మూతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం భేటీ అయ్యారు. ఆమెకు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News