వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా కొత్త నియమితులైన తులసి గబ్బర్డ్‌తో భేటీ అయ్యారు. ఆమె నియామక ధ్రువీకరణ తర్వాత మోడీ ఆమెను అభినందించారు. తులసి గబ్బార్డ్ ఓ హిందూఅమెరికన్. ఆమె నియామకం బుధవారం ధ్రువీకృతం అయింది. ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘వాషింగ్లన్ డిసిలో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌ను కలుసుకున్నాను. ఆమె నూతన పదవీ ధ్రువీకరణ తర్వాత ఆమెను అభినందించాను. భారతఅమెరికా స్నేహసంబంధాలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించాను. ఆమె ఈ సంబంధాలకు గట్టి మద్దతుదారు’ అని పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ కూడా తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీలకు ఎదురవుతున్న ముప్పుల గురించి చర్చించాం’ అని పేర్కొన్నారు. ఇదిలావుండగా మోడీ, ట్రంప్‌తో గురువారం ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
అమెరికా ఇంటెలిజెన్స్ డైరక్టర్ తులసి గబ్బర్డ్‌తో ప్రధాని మోడీ భేటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -