Sunday, December 22, 2024

ఈ ఎన్నికలు నవశకానికి నాంది:మోడీ

- Advertisement -
- Advertisement -

శనివారం పోలింగ్ నేపథ్యంలో తన నియోజకవర్గం వారణాసి ఓటర్లకు ప్రధాని మోడీ గురువారం ఓ సందేశం వెలువరించారు. ఈ ఎన్నికలు కేవలం నవకాశీ నిర్మాణం కోసమే కాదు, సంపన్న భారతదేశ ఆవిష్కరణకు అని తెలిపారు. జూన్ 1వ తేదీన జరిగే ఎన్నికల్లో కాశీ ప్రజలు సరికొత్త రికార్డును సృష్టించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి ప్రధాని మోడీ 2014 నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నవిత్రస్థలానికి ప్రాతినిధ్యం వహించడం అంటే సాధారణ విషయం కాదని, కేవలం ఇది ఆ బాబా కాశీ విశ్వనాథుడి అపారదయతోనే సాధ్యమమ్యే విషయం అని తేల్చిచెప్పారు.ఈ క్షేత్రానికి ఎనలేని విలువ ఉంది. తనకు సంబంధించి ఈ నగరం ఆధ్మాత్మికత, భక్తి , శక్తి, సేవాదృకధపు నిలయం . కాశీ సాంస్కృతిక వేదిక. ఈ విషయంలో ప్రపంచానికి ఓ రాజధాని, సంగీత స్థలి, ఇక్కడి నుంచి సేవాభాగ్యం దక్కడం తనకు దక్కిన అదృష్టం అన్నారు. గత పది సంవత్సరాల వ్యవధిలో ఈ ప్రాంతం అన్ని విధాలుగా విలసిల్లిందన్నారు, యువజన సంక్షేమానికి పట్టుగొమ్మ అయింది.

పలు అంశాలలో ఇక్కడి ప్రజల ఉత్సాహం ఉత్తేజం తనను కదిలించివేసిందన్నారు. కాశీని మరింతగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు తాను కంకణం కట్టుకున్నానని, ఈ ఎన్నికలలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు బార్లు తీరి ఓటేస్తే ఇది మరింత సాధ్యం అవుతుందన్నారు. ఈ సందర్భంగా తాను యువతకు,మహిళా శక్తికి , స్థానిక రైతులకు ప్రత్యేక విజ్ఞప్తి చేయదల్చుకున్నానని, ప్రతి ఓటరు తనకు మరింత బలం కల్పిస్తారని , సేవా మార్గంలో నూతన శక్తిని కల్పిస్తారని తెలిపారు. ప్రతి ఓటరు ముందు తాము ఓటేయాలి తరువాతే సేదదీరాలని గుర్తుంచుకోవల్సి ఉందని తమ వీడియో సందేశంలో పేర్కొన్నారు. వారణాసితో పాటు యుపిలోని మిగిలిన 13 లోక్‌సభ స్థానాలకు శనివారం ఓటింగ్ జరుగుతుంది. 2014లో మోడీ ఇక్కడి నుంచి 3.7 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. తరువాతి 2019 ఎన్నికలలో ఆయన దాదాపు 4.8 లక్షల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇప్పుడు మరింత రికార్డు స్థాయి మెజార్టీని తాను ఆశిస్తున్నట్లు పరోక్షంగా మోడీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News