Monday, February 10, 2025

13న యుఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

వాణిజ్యం, రక్షణ రంగాలపై ప్రధానంగా చర్చ
ఎలాన్ మస్క్‌తో కూడా మోడీ చర్చలకు అవకాశం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అయినప్పుడు దిగుమతి టారిఫ్‌ల తగ్గింపు, యుఎస్ నుంచి మరింతగా ఇంధన శక్తి, రక్షణ పరికరాల కొనుగోలు గురించి చర్చించేందుకు సిద్ధమయ్యారని ఈ వ్యవహారం గురించి తెలిసిన భారతీయ అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ ఈ నెల 12న వాషింగ్టన్ చేరుకోనున్నారు. ఆయన 13న ట్రంప్‌తో భేటీ కావచ్చు. ఎలాన్ మస్క్, ఇతర యుఎస్ వాణిజ్య ఉన్నతాధికారులతో కూడా సమావేశాలను ప్రతిపాదించారని,, కానీ ఏదీ ఇంకా నిర్ధారణ కాలేదని ఆ అధికారులు చెప్పారు.

ఆ చర్చలు ప్రైవేట్‌వి కనుక తమ పేర్లు వెల్లడించవద్దని వారు మీడియాను కోరారు. ఇద్దరు అధినేతలు సమావేశం అయినప్పుడు ‘టారిఫ్‌లపై మరింత తీవ్రంగా చర్చ జరగవచ్చు’ అని న్యూఢిల్లీ భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శుక్రవారం విలేకరులతో చెప్పారు. ట్రంప్ తన తొలి హయాంలో వాణిజ్య పరంగా తీసుకున్న చర్యలకు ప్రతిగా 2019లో యుఎస్ సరకులపై విధించిన కొన్ని టారిఫ్‌లను దశలవారీగా తొలగించేందుకు న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని పేర్లు వెల్లడికి ఇష్టపడని అధికారులు సూచించారు. ప్రతీకార సుంకాల జాబితాలో నుంచి ఎనిమిది సరకులను భారత ప్రభుత్వం తొలగించింది. కానీ 20 సరకులకు ఇంకా అధిక సుంకాలు వర్తిస్తున్నాయి.

మార్కెట్ సదుపాయంపై కొన్ని సమస్యలకు సంబంధించి యుఎస్‌తో పరిమిత వాణిజ్య ఒప్పందాన్ని చర్చించేందుకు కూడా భారత్ సుముఖంగా ఉన్నదని, ట్రంప్ తొలి హయాంలో అటువంటి ఒప్పందం కోసం భారత్ విఫల యత్నంచేసిందని ఆ అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం మీడియా పంపిన ఇమెయిల్స్‌కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ, వాణిజ్య. పరిశ్రమల మంత్రిత్వశాఖ వెంటనే స్పందించలేదు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనను సంతుష్టిడిని చేసేందుకు ఆయన ప్రధాన అజెండాకు కీలకమైన పలు చర్యలను మోడీ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నది. ఆధునిక మోటార్‌బైక్‌లతో సహా దిగుమతి సుంకాలపై భారత్ క్రితం వారం తన బడ్జెట్‌లో గణనీయమైన కోతలు విధించింది. ఆ సుంకాలు హార్లీ డేవిడ్‌సన్ ఇన్‌కార్పొరేటెడ్ వంటి యుఎస్ సంస్థలను ప్రభావితం చేస్తాయి. భారత అధిక దిగుమతి సుంకాల వల్ల నష్టానికి గురవుతున్న యుఎస్ వాణిజ్యానికి ఒక ఉదాహరణగా హార్లీని ట్రంప్ తరచు ఉటంకిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News