Sunday, December 22, 2024

భారత్, చైనా మధ్య శాంతి సుస్థిర బంధం

- Advertisement -
- Advertisement -

కజాన్: సుమారు ఐదు సంవత్సరాల్లో తొలిసారిగా ప్రత్యేక ద్వైపాక్షిక చ ర్చల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భార త్, చైనా పరిణతి, పరస్పర గౌరవం ప్రదర్శిస్తూ ‘శాంతియుత, సుస్థిర’ సంబంధం కలిగి ఉండగలవని బుధవారం అంగీకరించారు. తూర్పు లడఖ్‌లో దీర్ఘకాలంగా సాగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారంపై ఒప్పందాన్ని ఉభయ నేతలు ధ్రువీకరించారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎ సి) పొడుగునా శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగించే సరిహద్దు సం బంధిత విషయాలపై విభేదాలన సాగనివ్వవలసిన అవసరం లేదని మో డీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. భారత్, చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధులు (ఎస్‌ఆర్) సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతల కొనసాగింపునకు, వివాదం పరిష్కారంలో కీలక పాత్ర పోషించవలసి ఉంటుందని ఉభయ నేతలూ సూచించారు.

సాధ్యమైనంత త్వరలో సమావేశమై, తమ యత్నాలను కొనసాగించాలని ప్రత్యేక ప్రతినిధులను మోడీ, జిన్‌పింగ్ ఆదేశించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియా గోష్ఠిలో తెలియజేశారు. ‘ఒక సముచిత తేదీన ప్రత్యేక ప్రతినిధుల తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. వ్యూహాత్మక, దీర్ఘ కాలిక దృక్పథంతో ద్వైపాక్షిక సంబంధాల పరిసిథతిని మోడీ, జిన్‌పింగ్ సమీక్షించారని, రెండు దేశాల మధ్య స్థిరమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, సౌభాగ్యాలపై సకారాత్మక ప్రభావం ప్రసరిస్తాయని వారు భావిస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు. పరిణతి, విజ్ఞతతో, పరస్పర గౌరవం ప్రదర్శన ద్వారా భారత్, చైనా శాంతియుత, సుస్థిర సంబంధం కలిగి ఉండగలవని మోడీ, జిన్‌పింగ్ నొక్కిచెప్పారని మిశ్రి తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత పునరుద్ధరణ తిరిగి మామూలు సంబంధాలు నెలకొల్పడానికి దోహదం చేయగలదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News