Wednesday, January 22, 2025

ప్రధాని మోడీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ బుధవారం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. హీరాబెన్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఇటీవలే హీరాబెన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా మోడీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తర్వాత ప్రధాని గతంలో గాంధీనగర్‌లోని నివాసంలో ఆమెను కలిశారు. హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News