Sunday, December 22, 2024

మోడీని నిలదీసిన ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టలో ముస్లిం లీగ్ ముద్రలు ఉన్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తిప్పికొట్టారు. రోజురోజుకూ తన ఎన్నికల విజయావకాశాలు పడిపోతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ తన మంచి మిత్రుడిని గుర్తు చేసుకోవడం మొదలు పెట్టిందని ఖర్గే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గత శుక్రవారం విడుదల చేసిన మేనిఫెస్టోపై ముస్లిం లీగ్ ప్రభావం ఉందని ప్రధాని మోడీ ఆరోపించిన నేపథంలో దీనికి ఖర్గే సోమవారం కౌంటర్ ఇచ్చారు.

స్వాతంత్య్రానికి పూర్వం దేశంలోని కొన్ని ప్రావిన్సులలో ఉన్న కూటమి ప్రభుత్వాలలో జనంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ భాగస్వామిగా ఉన్నారని ఖర్గే గుర్తు చేశారు. కాగా..ప్రజల దృష్టిని మళ్లించి మళ్లీ విచ్ఛిన్నకర అజెండాను తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా బిజెపి ఈ దాడి మొదలుపెట్టిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బిజెపి కుతంత్రాన్ని బయటపెటేందుకు దూకుడుగా వెళ్లాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాపై ఎక్స్ వేదికగా ఖర్గే మండిపడ్డారు.

దేశంలోని సగటు పౌరుల ఆశయాలు, అవసరాలు, డిమాండ్ల ప్రాతిపదికగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని ఖర్గే స్పష్టం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిష్, ముస్లిం లీగ్‌కు మోడీ-షా రాజకీయ, సిద్ధాంతపర పూర్వీకులు మద్దతుపలికారని ఖర్గే విమర్శించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన 1942లో జరిగిన సమావేశంలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వగా దీన్ని కూడా మోడీ-షా రాజకీయ, సిద్ధాంతపర పూర్వీకులువ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. ముస్లిం టీగ్ మద్దతుతో 1940వ దశకలో బెంగాల్, సింధ్, ఎన్‌డబ్లుఎఫ్‌పిలో వ్యామ ప్రసాద ముఖర్జీ ఎలా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారో అందిరికీ తెలుసునని ఖర్గే వ్యాఖ్యానించారు.

క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎలా అలా ఎదుర్కోవాలో, కాంగ్రెస్‌ను ఎలా అణచివేయాలో వివరిస్తూ అప్పటి బ్రిటిష్ గవర్నర్‌కు శ్యామ ప్రసాద్ ముఖర్జీ లేఖ రాయలేదా అని ప్రధాని మోడీని ఖర్గే ప్రశ్నించారు. ఈ కారణంగానే బ్రిటిష్ పాలకులను భారతీయులు నమ్మవలసి వచ్చిందా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ-షా, బిఝెపి నామినేటెడ్ అధ్యక్షుడు ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ ఉపన్యాసాలలో ఆర్‌ఎస్‌ఎస్ ఆక్రోశం కనిపిస్తోందని, బిజెపి ఎన్నికల విజయావకాశాలు రోజురోజుకూ పడిపోతున్నాయని, ఈ కారణంగానే ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు తన మంచి బిత్రుడు ముస్లిం లీగ్‌ను గుర్తు చేసుకుంటోందని ఖర్గే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News