Monday, December 23, 2024

2 నుంచి 4వరకూ ప్రధాని మోడీ విదేశీ పర్యటన

- Advertisement -
- Advertisement -

PM Modi to pay official visit to Germany-Denmark

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల (మే) 2 నుంచి 4 వ తేదీ వరకూ విదేశీపర్యటనకు వెళ్లుతున్నారు. ఆయన జర్మనీ, డెన్మార్క్‌లలో మూడు రోజుల పర్యటనకు వెళ్లుతున్నారని బుధవారం విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఇదే తొలిసారి. వివిధ రంగాలలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశలో ప్రధాని అక్కడికి వెళ్లుతున్నారు. ముందు ఆయన జర్మనీకి వెళ్లి అక్కడి నుంచి డెన్మార్‌క వెళ్లుతారు. తిరుగు ప్రయాణంలో మే 4న ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో కొద్ది సేపు భేటీ అవుతారు. సోమవారం ప్రాన్స్ అధ్యక్షులుగా తిరిగి మెక్రాన్ ఎన్నికయ్యారు. జర్మనీలో ఆరవ ఇండియా జర్మనీ ప్రభుత్వ అంతర్ సంప్రదింపుల ప్రక్రియ (ఐజిసి)లో పాల్గొంటారు. జర్మనీ దేశాధ్యక్షులు ఒలాఫ్ స్కోలోజ్‌తో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఐజిసికి ఇద్దరు నేతలు సహ సారధ్యం వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News