న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల పర్యటనపై బుధవారం అమెరికాకు బయలుదేరనున్నారు. తన పర్యటనలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగిస్తారు. ‘క్వాడ్’ సమావేశానికి హాజరవుతారు. వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు.
బైడెన్ అమెరికా అధ్యక్షపదవిని చేపట్టాక అమెరికాకు ఇది మోడీ మొదటి పర్యటన. అయితే వీరిద్దరు ఇప్పటికే మార్చిలో క్వాడ్ సమావేశం, ఏప్రిల్‌లో వాతావరణ మార్పు సమావేశం, ఈ సంవత్సరం జూన్‌లో జి-7 సమావేశంలో వర్చువల్‌గా కలుసుకున్నారు. తాజాగా మోడీ సెప్టెంబర్ 24న బైడెన్‌తో సమావేశం కానున్నారు.
ప్రధాని పర్యటనలో ఆయనతోపాటుగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వెళుతుంది. ఈ పర్యటన సందర్భంగా భారత, అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధం మరింత బలపడుతుందని భావిస్తున్నారు.
మోడీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో కూడా ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 23న ఆయన వాషింగ్టన్‌లో అమెరికా కంపెనీ సిఇఒలతో సమావేశం కానున్నారు. వార్తా సంస్థల కథనం ప్రకారం మోడీ సెప్టెంబర్ 22న వాషింగ్టన్ చేరుకోనున్నారు. ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్‌తో కూడా మోడీ సమావేశం అవుతారని సమాచారం. ఇక సెప్టెంబర్ 24 ఆయన క్వాడ్ నాయకుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్,జపాన్ ప్రధాని యోషిహిడే సుగతో కలిసి పాల్గొననున్నారు. సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 76వ సమావేశంలో కోవిడ్‌పై ప్రసంగించనున్నారు. అమెరికాకు బయలు దేరడానికి ముందు మోడీ ఓ సందేశాన్ని కూడా వెలువరించారు.
అమెరికాకు 5రోజుల పర్యటనపై మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -