న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ అమర వీరుల స్తూపం వద్ద సమర యోధులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుష్పాంజలి ఘటించారు. స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచడం ద్వారా జాతి తరఫున అమర వీరులకు ప్రధాని నివాళి అర్పించారు. ఇండియా గేట్ వద్ద ప్రతిష్ఠాకరమైన అమర వీరుల స్తూపాన్ని మోడీ 2019లో ఆవిష్కరించారు. 1962తో భారత్, చైనా యుద్ధం, 1947, 1965, 1971 భారత్,
పాక్ యుద్ధాలు, శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణ దళం కార్యకలాపాలు, 1999లో కార్గిల్ ఘర్షణలోను, ఐక్యరాజ్య సమితి (యుఎన్) శాంతి పరిరక్షణ కార్యక్రమాలలోను హతులైన సైనికులకు ఆ స్తూపం అంకితం ఇవ్వడమైంది. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉ్న జాతీయ అమర వీరుల స్తూపంపై నాలుగు ప్రధాన చక్రాలు & ‘అమర్ చక్ర’, ‘వీర్‌తా చక్ర’, ‘త్యాగ్ చక్ర’, ‘రక్షక్ చక్ర’ పొందుపరిచారు. పాలరాతి ఫలకాలపై స్వర్ణాక్షరాలలో 25942 మంది జవాన్ల పేర్లను లిఖించారు.