Sunday, January 19, 2025

నగరంలో ప్రధాని పర్యటన..ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నెల 4,5వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన రాత్రి 7.40 నుంచి రాత్రి 8.10 గంటలకు ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు ఎయిర్ పోర్టు వై జంక్షన్, పిఎన్‌టి ఫ్లైఓవర్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, రాజీవ్‌గాంధీ విగ్రహం, మోనప్ప ఐస్‌ల్యాండ్ జంక్షన్, యశోద ఆస్పత్రి, ఎంఎంటిఎస్ మార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. 5వ తేదీ ఉదయం 9.50 గంటల నుంచి 10.15 వరకు ప్రధాని రాజ్‌భవన్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. ఈ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి, ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News