Monday, December 23, 2024

సిఎంని రావొద్దని నేనే చెప్పా : కాంగ్రెస్ విమర్శలపై మోడీ స్పష్టత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : శనివారం ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు, కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎం ఇద్దరిలో ఎవరూ హాజరు కాలేదు. మోడీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్‌పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అందుకు ప్రధాని నరేంద్రమోడీనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. ‘ తనకంటే ముందు కర్ణాటక ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంపై మోడీ చాలా చికాకుగా ఉన్నారు.

అందుకే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వారిద్దరినీ ఉద్దేశపూర్వకంగా ఎయిర్ పోర్టుకు రాకుండా ఆపేశారు. ఇలాంటి రాజకీయాలు హాస్యాస్పదం. చంద్రయాన్ 1 విజయం వేళ …2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందు సీఎంగా ఉన్న మోడీ, అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు వెళ్లారు. ఆ విషయాన్ని మోడీ మర్చిపోయారా ? అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. దీనిపై మోడీ నుంచి స్పష్టత వచ్చింది. బెంగళూరు లోని హాల్ ఎయిర్‌పోర్టు వెలుపల ప్రధాని మాట్లాడుతూ వారిని రావొద్దనడానికి కారణం చెప్పారు.

బెంగళూరుకు నేను ఏ సమయంలో చేరుకుంటానో కచ్చితంగా తెలీదు. అందుకే ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. అందుకే వారిని రావొద్దని చెప్పాను. ’ అని మోడీ వెల్లడించారు. శుక్రవారం గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని మోడీ శనివారం ఉదయం నేరుగా బెంగళూరు వచ్చి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారి కృషికి సెల్యూట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News