Thursday, December 19, 2024

ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi Participating ICRISAT Golden Jubilee Celebrations

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రధానికి ఎయిర్ పోర్టులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సిఎస్, డిజిపిలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్ కి చేరుకున్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇక్రిశాట్ లో సాగు సంబంధిత ఎగ్జిబిషన్ ప్రధాని తిలకించారు. మెట్ట పంటలు, పరిశోధనలను ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు ప్రధాని మోడీకి వివరించారు. ఈ కార్యక్రమానికి కొద్దిమంది శాస్త్రవేత్తలను మాత్రమే అనుమతిచ్చారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్ ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని 10 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఇక్రిశాట్ వద్ద 2 వేల మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News