Sunday, January 19, 2025

మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముని సమాధికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ పుష్పాంజలి ఘటించారు. ఉపాధ్యక్షులు జగ్‌దీప్ ఢన్‌కర్ , దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కూడా నివాళులు అర్పించారు. గాంధీ సమాధి వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. పూజ్య బాపూజీని ఆయన పుణ్య తిధి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను, అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు కూడా నివాళి అర్పిస్తున్నాను. వారి త్యాగాలే మనలను ప్రజాసేవ చేయడానికి స్ఫూర్తి కలిగిస్తున్నాయి.

వారి విజన్‌ను నెరవేరుస్తున్నాయి.” అని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని మోడీ జీవితంలో అభివృద్ధిని సూచించే ఆయా తేదీల వివరాలను ప్రదర్శించారు. మోడీ వ్యక్తిగత డైరీ నుంచి కొన్ని పేజీలను ఈ పోస్ట్‌లోచూపించారు . అందులో గాంధీ సూక్తులు నమోదు చేసి ఉన్నాయి. మహాత్మాగాంధీ జీవిత విశేషాలను మోడీ విస్తృతంగా అధ్యయనం చేయడమే కాకుండా తనకు ఏ విధంగా స్ఫూర్తి కలిగించాయో అందులో వివరించి ఉంది. మహాత్మాగాంతీ 1948 లో ఇదే రోజు నాథూరామ్ గాడ్సే కాల్పులకు అమరజీవులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News