Monday, December 23, 2024

వాజ్‌పాయ్, మాలవీయలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము నివాళులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పాయ్, మదన్‌మోహన్ మాలవీయల జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం నివాళులు అర్పించారు. వాజ్ పాయ్ 99వ జయంతిని పురస్కరించుకుని వాజ్‌పాయ్ గుణగణాలను ప్రశంసించారు. ఆయన తన జీవితాంతం దేశం వేగంగా పురోగతి చెందడానికి కృషి చేశారని కొనియాడారు. గొప్ప వక్త అయిన భారతీయ జనసంఘ్‌లో తరువాత భారతీయ జనతా పార్టీలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి అని, సిద్ధాంతాల సరిహద్దులకు అతీతంగా ఆయనను అందరూ అభిమానించడమే అనేక పార్టీల నుంచి బీజేపీ మద్దతు పొందడానికి దోహదపడిందని పేర్కొన్నారు. 1999 నుంచి 2004 వరకు విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని పాలించిన గొప్ప పరిపాలనా దక్షునిగా ప్రశంసించారు.

వాజ్‌పాయ్ అంకిత భావం, దేశ సేవా స్ఫూర్తి ‘అమృత్‌కాల్ ’ సమయంలో స్ఫూర్తి కలిగించే ఆధారంగా తన ఎక్స్ పోస్ట్‌లో ప్రశంసించారు. మరో పోస్ట్‌లో స్వాతంత్య్ర సమర యోధుడు, విద్యావేత్త మదన్‌మోహన్ మాలవీయకు మోడీ నివాళులు అర్పించారు. మాలవీయ సాటిలేని వ్యక్తిత్వం, సేవ దేశం లోని ప్రతి తరానికి ప్రేరణ కలిగిస్తుందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలాసీతారామన్, కిరెన్ రిజ్జు, హర్‌దీప్‌సింగ్ పురి, అర్జున్‌రామ్ మేఘ్వాల్, తదితరులు వాజ్‌పాయ్, మాలవీయలకు నివాళులు అర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News