- Advertisement -
కార్గిల్ యుద్దంలో అమరులైన భారత జవాన్లకు పిఎం మోడీ ఘన నివాళులర్పించారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సైనికులను తిప్పికొట్టి నాటి యుద్దంలో అమరులైన వీర జవాన్లకు పిఎం మోడీ నివాళులర్పించారు. కార్గిల్ యుద్దం జరిగి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు. కార్గిల్ 25వ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో గల యుద్ద వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించారు.
- Advertisement -