- Advertisement -
న్యూఢిల్లీ : పరస్పర సోదరభావపు సమైక్యత, సహనశీలతతో మానవాళి సాగాలని మహాత్మా గాంధీ తన కార్యాచరణతో చాటారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గాంధీజి జయంతి సందర్భంగా సోమవారం ప్రధాని మోడీ ఇక్కడ జాతిపితకు నివాళులు అర్పించారు. గాంధీజి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో స్ఫూర్తి రగిలించారని తెలిపారు. మానవాళికి తన జీవితాన్నే సందేశంగా వెలువరించారని పేర్కొన్నారు. మహాత్మా కన్నకలలను నెరవేర్చేందుకు మనమంతా కలిసికట్టుగా పాటుపడాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఈ రోజే దేశ రెండవ ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి కూడా ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రీజీ సేవలను కూడా ప్రధాని స్మరించుకున్నారు. ఆయన నిరాడంబరత, దేశం పట్ల అంకితభావం , జై జవాన్‌జై కిసాన్ వంటి ప్రతీకాత్మక నినాదాలు తరతరాల పాటు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు.
- Advertisement -