Monday, December 23, 2024

అంబేద్కర్ వర్ధంతి… ప్రధాని మోడీ నివాళి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ రూపశిల్పియే కాకుండా సామాజిక సామరస్యానికి అజరామరమైన ఛాంపియన్‌గా నిలిచారని కొనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి భారత రాజకీయాల్లో అత్యంత ప్రధాన నాయకునిగా ఎదిగారని పేర్కొన్నారు.

ఆయన 1956 లో కన్నుమూసినప్పటికీ ఆయన భావజాలం, ఆలోచనలకు దక్కిన గుర్తింపు ఏళ్లకొలది పెరుగుతూనే ఉందని, ముఖ్యంగా దళిత నేపథ్యం , షెడ్యూల్డ్ కులాల్లో ఆధారమై ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తోందని వివరించారు. అలాగే ఆయన స్ఫూరి ఇతర బలహానవర్గాలు విద్యారంగం లోనూ రాజ్యాంగపరమైన ఆందోళనలకు , ఏకీకరణకు ఊతం కలిగిస్తోందని ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News