Monday, December 23, 2024

పిల్లలతో మోడీ జంతర్‌మంతర్..

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ప్రధాని నరేంద్ర మోడీ వీలు దొరికినప్పుడల్లా పిల్లలతో సరదా ఆటలకు దిగడం పరిపాటి. ఈ మధ్యలోనే ఆయన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార హోరు దశలోనే కొంచెం తీరిక చేసుకుని తన వద్దకు వచ్చిన ఇద్దరు ముగ్గురు చిన్నారులతో కాసేపు రూపాయి నాణెం ఆటాడుకున్నారు. వారిని పలకరించి పేర్లు తెలుసుకుని ఛూ మంతర్ తరహాలో తన నుదుటి మధ్యలో నాణేం పెట్టుకుని కళ్లు మూసుకుని తలవెనుక కొద్దిగా చర్చుకున్నారు. తరువాత చూస్తే నాణేం లేదు. కొద్ది సేపటి తరువాత ఈ నాణెం మోడీ చేతిలో ఉంది.

ఈ మ్యాజిక్‌ను మోడీ అదేపనిగా తన ముందు ఉన్న పిల్లలతో కూడా చేయించారు . తన వద్ద ఉన్న పైసా ఎంత ఆడుకున్నా తన చేతిలోనే ఉంటుందని, ఇది చేజారిపోదని పిల్లలకు చెప్పారు. ఎన్నికల ఛత్తీస్‌గఢ్‌లో పిల్లలతో ఈ ఆటను తెలిపే వీడియోను ఆ తరువాత ప్రధాని ఎక్స్ సామాజిక మాధ్యమంలో పొందుపర్చారు. ఈ ఉదంతంపై బిజెపి నేతలు స్పందిస్తూ మోడీజి పిల్లలతో పిల్లవాడిగా ఉన్నారని తెలిపారు. అయితే ఇటువంటి జంతర్‌మంతర్‌లు ఆయనకు అలవాటేనని ప్రతిపక్ష , ఛత్తీస్‌గఢ్ అధికార పక్ష కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News